చీరాల నియోజవర్గ స్థాయి టిడిపి కమిటీల ఏర్పాటుపై మంగళవారం పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అంకితమై పని చేసే వారికి తప్పనిసరిగా పదవులు ఇస్తామని భరోసా ఇచ్చారు.పదవులు రానివారు నిరాశపడనవసరం లేదని,వారికి వేరే అవకాశాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమిష్టిగా కృషిచేసి చీరాలలో టిడిపికి తిరుగులేని వాతావరణం సృష్టిద్దామని ఆయన పిలుపునిచ్చారు.