జిల్లాలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు నివారణకు 9 హైవే మొబైల్ టీములు నిత్యం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలో భాగంగా, శనివారం అర్ధరాత్రి జిల్లాలోని జాతీయ రహదారులపై జిల్లా పోలీసులు స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు.