రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండల కేంద్రంలో, రూసో బి.ఎడ్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు శనివారం 6 PM నుండి 8 PM వరకు ఘనంగా బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు,విద్యార్థులు రకరకాల పూలు సేకరించి బతుకమ్మను పేర్చి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆడారు,ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దేవేందర్ తో పాటుగా పలువురు విద్యార్థినిలు మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పూలతో చేసుకునే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ,తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ యాసలో పాటలు పాడుతూ,తల్లి కూతుర్లు, అన్నాచెల్లెళ్ల అనురాగాలు ఉమ్మడి కుటుంబంలో, కష్టసుఖాల గురించి మహిళలు తమ పాటల ద్వారా వెల్లడిస్తారు గౌరీని బతుకమ్మగా పూజిస్తారన్నారు,