పెద్దచెర్లోపల్లి మండలంలోని దివాకరపురంలో నూతనంగా నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా ప్లాంట్ కు సంబంధించిన కాంపౌండ్ వాల్ కు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన పూజా కార్యక్రమాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... వెనకబడిన పెద్ద చెర్లోపల్లి మండలంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ రావడం వల్ల రైతులకు ఎంతగానో లబ్ధి చేకూరడంతో పాటు రైతుల వలసలు ఆగుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నారు.