కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో కలెక్టరెట్ లో సమావేశం నిర్వహించి జిల్లాలో వర్షం అనంతరం చేపట్టిన వివిధ పునరుద్దరణ పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరుసగా కురిచిన భారీ వర్షాల వలన జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్న రహదారులు, విధ్యుత్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు తదితర వసతుల పునరుద్దరణ కోసం తాత్కాలిక చేపట్టిన పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అదేవిధంగా పర్మనెంట్ పనుల కోసం పూర్తిస్థాయి ప్రతిపాదనలు రేపటి లోగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు ఉన్నారు.