బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పరిధిలో రైతులకు మొత్తం 69.30 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వ్యవసాయ అధికారి నరేంద్రబాబు సోమవారం తెలిపారు. కొల్లూరు, ఈపూరు, దోనేపూడి పిఎసిఎస్ లలో ఒక్కొక్కదానిలో 19.80 మెట్రిక్ టన్నులు, కొల్లూరు జిడిసిఎంఎస్ లో 9.9 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించారు. మిగిలిన ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.