భీంగల్ పట్టణంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని పట్టణ బిజెపి అధ్యక్షులు మధు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలో నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో కూరగాయల మార్కెట్, పండ్ల దుకాణాలు రోడ్లపై ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే మార్కెట్ ను పాత ఎమ్మార్వో కార్యాలయ స్థలంలోకి మార్చాలన్నారు. అలాగే మండలంలో నూతన పోస్ట్ ఆఫీస్ మంజూరైన పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని తెలిపారు. వెంటనే వాటి పనులను పూర్తి చేయాలన్నారు.