జమ్మికుంట: తాము చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది ఉండటం విశేషం పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబు తో పాటు ఉపాధ్యాయులు బొడిగల సమ్మయ్య, కట్కూరి వెంకట్ రెడ్డి,కొలుగురి సంపత్, మ్యాకమాల్ల శ్రీనివాస్,వట్టేపల్లి ప్రకాష్,రాం రాజయ్య ఇదే పాఠశాలలో చదువుకొని ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.