Araku Valley, Alluri Sitharama Raju | Aug 22, 2025
గూడెం కొత్త వీధి మండలంలోని ఏ.దారకొండ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై సుమారు మూడు నెలలు కావస్తున్నా.. నేటికీ ఉపాధ్యాయున్ని నియమించకుండా చోద్యం చూస్తున్న గూడెం కొత్త వీధి మండల విద్యాశాఖ అధికారులని గొల్లపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అధికారులపై మీ పిల్లలే చదువుకోవాలా మా పిల్లలు ఇలా నెలల తరబడి ఉపాధ్యాయులు లేని పాఠశాలకి వచ్చే ఆడుకోవాలా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.తరగతులు బోధించేందుకు ఉపాధ్యాయుడిని నియమించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న మండల విద్యాశాఖ కార్యాలయం పై గ్రామస్తులు పిల్లలతో కలిసి ముట్టడి చేస్తామని హెచ్చరించారు.