అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామ అభివృద్ధి కోసం శనివారం అష్టదిక్పాలక పూజా కార్యక్రమాన్ని గ్రామస్తులు భజన మండలి సభ్యులు కలసి నిర్వహించారు. తొలితగా గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలను నిర్వహించిన అనంతరం గ్రామ పొలిమేరలో నాలుగు దిక్కుల్లోనూ పూజలను నిర్వహించి బలి అన్నం చల్లుతూ అష్టదిక్పాలక పూజలను నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలను నిర్వహించినట్టు గ్రామస్తులు పేర్కొన్నారు.