గంగవరం: ఆసుపత్రి వర్గాలు తెలిపిన సమాచారం మేరకు, గుండుగల్లు గ్రామంలో చెట్టు కొమ్మలు కట్ చేస్తున్నప్పుడు కూసుగా ఉన్న కొమ్మ మాధవరెడ్డి అనే వ్యక్తి తలపై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకొని ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుందా లేదా మరింకేదైనా కోణం ఉందా అనే వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు.