యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గ్రామ మాజీ సర్పంచ్ నారగోని అంజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నారని అన్నారు . ఎమ్మెల్యే మందుల సామెల్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సర్పంచిగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేసింది ఏమీ లేదన్నారు.