నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో వాగు పొంగిపొర్లుతూ ఉండడంతో ప్రజలు శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అటువైపుగా ప్రయాణించే ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్రభయాందోళన వ్యక్త చేస్తున్నారు. పాత అన్నవరం వెళ్లే మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొలం పనులకు వెళ్లే రైతులు, అటువైపుగా గ్రామాలకు వెళ్లే ప్రజల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఎగువ నుండి వచ్చిన వర్షపు నీరు వాగులో తీవ్ర రూపం దాల్చినట్లు స్థానికులు తెలిపారు రెవిన్యూ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై అటువైపు రాకపోకలపై నిలిపివేశారు వర్షపు నీటిలో ప్రయాణించరాదని