పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు 75 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మానవత్వంతో పేద, మధ్య తరగతి వర్గాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సాయం అందిస్తున్నారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా చంద్రబాబు పునరుద్ధరించారు అని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లాడు అని విమర్శించారు.