నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఓ కిరాణా షాప్ ముందు ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మృతుని మెడకు బట్ట, సుతిలితో బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు కనపడుతోందని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యలో ఈ హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 50-55 వయసున్న మృతుని వద్ద ముస్లిం టోపీ ఉందని, మృతుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు