గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులపై పాల్వంచ టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రైల్వే ట్రాక్ పై ఇద్దరి యువకులు గంజాయి సేవిస్తూ కనిపించారు. అందులో ఒక యువకుడు పరారవ్వగా మరో యువకుడు రమేష్ పోలీసులకు చిక్కాడు. అతనిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 50 గ్రాములు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన రమేష్, పరారీలో ఉన్న సాయికిరణ్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాల్వంచ టౌన్ ఎస్ఐ సుమన్ తెలిపారు..