నిజామాబాద్ నగర శివారులోని అశోక్ సాగర్ కెనాల్ లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభిమైనట్లు ఆరవ టౌన్ ఎస్సై వెంకట్రావు సోమవారం తెలిపారు. సాగర్ లో మృతదేహం ఉండటంతో స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు వయస్సు 35-40 సంవత్సరాల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. క్రీం కలర్ డబ్బాల షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు సూచించారు