అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు నీలి మేఘాలు కమ్ముకొని సుమారు రెండు గంటల పాటు వర్షం దంచి కొట్టింది. చవితి వేడుకలు నిర్వహిస్తున్న తరుణంలో వర్షం కురవడంతో వినాయక మండపాలు మందిరాలు తడిసి ముద్దయినాయి. గ్రామంలోని వీధుల్లో వర్షపు నీరు పరుగులు తీసింది. చవితి వేడుకల్లో పండుగ పూట కురిసిన వర్షం పంటలకు మేలు చేస్తుందని రైతులు గ్రామ వృద్ధులు పేర్కొంటున్నారు.