నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, మాల్ పట్టణంలో బుధవారం అర్ధరాత్రి దాటాక రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో మాల్ పట్టణానికి చెందిన సందీప్, నరసింహ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా డివైడర్ మధ్యలో ఉన్న సైన్ బోర్డు వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.