వృత్తిలో నిబద్దత, అంకితభావం, నిజాయితీ తో విధులు నిర్వర్తించి జిల్లా పోలీస్ శాఖకు విశిష్ట సేవలందించి పదోన్నతిపై అదనపు ఎస్.పి (ఏ.ఆర్) గా బదిలీపై వెళ్లడం అభినందనీయమని జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ కొనియాడారు. ఎ.ఆర్ డి.ఎస్పీ గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల పదోన్నతి పొంది ఏ.ఆర్ అదనపు ఎస్పీ గా ప్రకాశం జిల్లా కు వెళ్లిన శ్రీనివాస రావుకి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్.పి అశోక్ కుమార్ శ్రీనివాస రావుని శాలువా కప్పి ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేశారు.