నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణలో భాగంగా రైతుబజార్లు, సూపర్ మార్కెట్లలో అతి తక్కువ ధరకు విక్రయిస్తున్న కంది పప్పు, బియ్యం ధరలను మరింత తగ్గించినట్టు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. కేజీ కంది పప్పు రూ.160ల నుండి రూ.150లకు, స్టీమ్డ్ బియ్యం రూ.49ల నుండి 48కి, రా రైస్ రూ.47 నుండి రూ.46కు తగ్గించినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.