అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం ఐదు గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రామచంద్ర నగర్ లో గుండెపోటుతో మృతి చెందిన తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు సీనియర్ వైసీపీ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతి చెందడం బాధాకరమని. అదేవిధంగా తోపుదుర్తి భాస్కర్ రెడ్డి అంత్యక్రియలు ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో ఆదివారం నిర్వహించబోతున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు.