ప్రజా కవి కాళోజి సేవలు చిరస్మరణీయం అని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన అన్నారు.ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కలెక్టరేట్ ఏవో అనంత రామకృష్ణ తో కలసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.