జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలను విఘ్నం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరిక జారీ చేశారు .గురువారం రాత్రి రాజమండ్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాత్రి పగలు తనిఖీలు చేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు అదే విధంగా జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశామని తెలిపారు రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేశామని ప్రకటించారు.