ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. బజార్హత్నూర్, బేల, ఇంద్రవెల్లి, ఉట్నూర్, తాంసి, బీంపూర్, జైనథ్, తలమడుగు, తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారు. పలుచోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తుండగా..మరోవైపు పొలాలు బురుదమయమై ఇసుక మేటలతో దర్శనమిస్తున్నాయి.వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బుధవారం తలమడుగు మండల తహసిల్దార్ కు రైతులు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.