ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ సూచించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ సీఎం నారాచంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.