అన్ని వర్గాల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు.ఈ సందర్భంగా మేడిపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో హైమస్ లైట్స్ ను ప్రారంభించి,పనుల జాతరలో భాగంగా గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఈత చెట్లను నాటారు.