జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని సూర్యాపేట జనగామ రహదారిపై యూరియా కోసం రైతులు గురువారం ఉదయం ధర్నాకు దిగారు. పీఏసీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం అన్ని పనులు వదిలిపెట్టుకొని ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న పట్టించుకునే నాథుడు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.