నల్గొండ జిల్లా, వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట పాలేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వేములపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రావులపెంట గ్రామ సమీపంలో గల పాలేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న భయ్యా అనిల్, శీలం సైదులు అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఐస్కరణకు పాల్పడుతుండగా ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.