నల్గొండ జిల్లా, హాలియా పట్టణ కేంద్రంలో ఓయూ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మార్వాడీలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బంద్ కార్యక్రమంలో సెల్ఫోన్ దుకాణాల యజమానులు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి, షాపులు బంద్ చేసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్వాడీలు నాసిరకం వస్తువులను అమాయక ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మార్వాడిలు కింద షాపుల యజమానులకు తీవ్రంగా నష్టపరుస్తున్నారన్నారు. ఎంతోమంది మార్వాడీల వల్ల ఉపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి చిన్న షాపుల యజమానులను ఆదుకోవాలని కోరారు.