మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లో ఓ సామాజిక కార్యకర్త ఆదివారం మధ్యాహ్నం 3:00 లకు వినూత్నమైన నిరసన చేపట్టారు. నేతల తరాలు మారిన ప్రజల తలరాతలు మారడం లేదు అంటూ ప్ల కార్డుల గణేశుడి వేషధారణతో నిరసన చేపట్టాడు. డోర్నకల్ మండల కేంద్రం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎంతమంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు వచ్చిన అభివృద్ధికి చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి డోర్నకల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు.