గాంధారి మండలంలో గణపతి నిమజ్జనం సందర్భంగా డీజే లను నిషేధించారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అయినా కొందరు డిజే యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి డిజెలను పూర్తిగా నిషేధించిన నేపథ్యంలో సోమవారం గాంధారి మండలంలోని డిజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర బైండోవర్ చేసినట్లు ఎస్ఐ. ఆంజనేయులు తెలిపారు. ఎవరైనా నిమజ్జనంలో డిజే లు వాడితే కేసు నమోదు చేసి డీజే ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రభుత్వం నిబంధనలో మేరకే జరగాలని, డీజే లకు బదులుగా స్థానిక డప్పు కళాకారులకు ఉపాధి కల్పిస్తూ వారి సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.