బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపాలెం వద్ద కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకు వచ్చింది. ఆదివారం పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వైద్య శాలకు తరలించారు. మృతుడి ఒంటిపై ఎరుపు రంగు టీ షర్ట్, నల్ల రంగు ప్యాంటు ఉంది. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.