దేవరకద్ర నియోజకవర్గం భూత్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్లో మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జమియా మసీదులో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన ముస్లిం సోదర, సోదరీమణులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సర్వ మానవాళికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు