రెండు బస్తాల యూరియా కోసం మూడు గంటలు లైన్ లొ వేచిఉన్నామని చివరికి యూరియా అయిపోయిందని చెబుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం పట్టణంలోని మన గ్రోమర్ వద్ద ఉదయం 8 గంటల నుండే వందలాది మంది రైతులు క్యూ కట్టారు. 250 బస్తాలు వచ్చిందని అధికారులు చెబుతున్నా మన గ్రోమర్ నిర్వాహకులు మాత్రం యూరియా స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని రైతులు తెలిపారు. యూరియా వేయక పోవడంతో పైరు పెరగలేదని రెండు నెలలుగా తిరుగుతున్నా బస్తా యూరియా దొరకడం లేదని పలువురు రైతులు తెలిపారు.