ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన పెన్షన్లు మంజూరు చేయాలని ఉన్న పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం నరసాపూర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను పెంచాలని నూతన పింఛన్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 9న నిర్వహించే చెరువు హైదరాబాద్ ను విజయవంతం చేయాలని కోరారు.