వెలుగోడులో ట్రాక్టర్ బోల్తా పడి వరలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. పట్టణానికి చెందిన ఆంజనేయులు వరలక్ష్మి దంపతులు తమకున్న పొలానికి మందు వేసేందుకు తమతోపాటు మరో పదిమంది కూలీలను తీసుకొని ట్రాక్టర్ పై వెళుతుండగా వాగు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది ట్ర్యాలీ బోల్తాపడటంతో ట్యాలీలో ఉన్న మందు సంచులు వరలక్ష్మి పై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.మరో మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెలుగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. అప్పటివరకు తమతో ఉండి దిగతి జీవిగా మారడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.