నల్గొండ జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ పార్కులో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన కుక్కల దత్తత, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ.. వీధి కుక్కల సమస్యల పరిష్కారానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. వీధి కుక్కలను పెంచుకోవాలనుకునే వారు మున్సిపల్ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.