లింగంపేట్ బ్రిడ్జిని 12 ఫీట్ల వెడల్పుతో 3 కోట్ల రూపాయలతో కొత్త బ్రిడ్జిని నిర్మించాలి, పోల్కంపేట్ గ్రామంలో తెగిన పెద్ద చెరువు కుంటలు మరమ్మత్తులు చేసి రైతులకు పంట నష్టం ఎకరానికి రూ. 20,000 చొప్పున చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కే చంద్రశేఖర్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలంలోని లింగంపేట బ్రిడ్జి నిచేరుకొని తెగిపోయిన బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. పాత బ్రిడ్జి ఐదు ఫీట్ల వెడల్పుతోని 100 సంవత్సరాల క్రితం నిర్మించింది అని ఇప్పుడు తాతకాలికంగా పనులు నడుస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం వెంటనే 3 కోట్ల రూపాయలు చెల్లించి 12 ఫీట్ల వెడల్పుతో కొత్త బ్రిడ్జిని నిర్మించాలన్నారు.