విజయనగరం జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి మండలం గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేకపోవడంతో రోగులను డోలిమోతతో ఆసుపత్రులకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఉన్న మూసాయవలసకు చెందిన ఓ మహిళ బుధవారం అనారోగ్యం బారిన పడగా...ఆసుపత్రికి తరలించేందుకు డోలిమోతతో నారాసింహునిపేట రోడ్డుకు తీసుకుని వచ్చి టాటా మ్యాక్సీ సహాయంతో ఆసుపత్రికి తరలించారు. రోడ్డు వేయాలని కోరుతున్నారు.