అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని దుర్గా నగర్ కాలనీకి అనుకుని జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పోలవరం కాలువ నిర్మాణ పనుల్లో భాగంగా కొండను పగలుకొట్టేందుకు బాంబులను వినియోగిస్తున్నారు. దీంతో దుర్గా కాలనీలోని ఇళ్లు కంపించి పగుళ్లు ఏర్పడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. వేంటనే బాంబు బ్లాస్టింగ్ ఆపేయాలని కాలని వాసులు తహశీల్దార్ వాహనాన్ని నిర్బంధించారు.