యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారి పక్కన ఆదివారం రాత్రి బుద్ధి తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. గొర్రెల కాపరి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించగా పక్కన ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ లభించడంతో ఆధార్ కార్డులో సిహెచ్ వినయ్ కుమార్ రాజు ఈస్ట్ గోదావరి జిల్లా, మల్కాపురం వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.