పలమనేరు: పట్టణంలో ఉన్నటువంటి రచయితల సంఘం తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి, గ్రామ సేవా సమితి పలు సామాజిక సంఘాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని పుస్తకంతో నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేర్ పట్టణ పురవీధుల్లో పుస్తకాలను చేతబట్టి అన్ని పాఠశాలల్లో గంద్రాలయాలు ఏర్పాటు చేసుకోవాలి. మనోవికాసం మంచి పుస్తక పఠనం, అక్షర జ్ఞానం అంధకార నాశనం, పుస్తక పఠనం తిమిరంతో సమరం, అంటూ పలు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. తదుపరి విద్యార్థులను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి తదితర ముఖ్యులు ప్రసంగిస్తూ, సెల్ ఫోన్ వదిలి పుస్తకాలు చదువుదాం అన్నారు.