రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు కావలి ఆర్టీవో మురళీధర్ అన్నారు. గత శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో రుద్రకోటలో మీడియాతో మాట్లాడారు. వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వాహనదారుడు వాహన పత్రాలు త మ వద్దే ఉంచుకోవాలన్నారు.