బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం గుత్తా వారి పాలెం లో వాకా శరత్ అనే యువకుడు వరి పంట పొలానికి నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో గురువారం మృతి చెందాడు. పక్క పొలంలో పనిచేస్తున్నవారు గమనించి, అతన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య కల్పన ఫిర్యాదు మేరకు భట్టిప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.