*గణపతి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని కాకినాడ జిల్లా సామర్లకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఏర్పాటుచేసిన వినాయకుని కళ్యాణ మండపము నందు పెద్ద ఎత్తున హోమ పూజలను నిర్వహించారు ,గురువారం చివరి రోజు పెద్ద ఎత్తున నిర్వహించిన హోమ పూజల్లో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా ఇండస్ట్రియల్ స్టేట్ లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గణేష్ మండపంలో సుమారు 12 అడుగుల మట్టి గణపతి స్వామి వారిని ఎమ్మెల్యే రాజప్ప దర్శించుకున్నారు.అనంతరం జరిగిన హోమ పూజల్లో రాజప్ప పాల్గొన్నారు.