అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మదనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నిసార్ అహ్మద్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని .రైతుల పరిస్థితి మరి ధారణంగా మారిందని అన్నారు.. మదనపల్లెలో జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 14 నెలలైనా కార్యరూపం దాల్చేదని విమర్శించారు. యూరియా కోసం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిఅన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.