గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులు పట్ల అవగాహన పెంచాలి అని వైద్యాధికారిని డాక్టర్ ఉష పేర్కొన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో మెడికల్ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారిణి ఉష సి హెచ్ ఓ జయలు గ్రామ సర్పంచ్ రంగారెడ్డి లతో కలిసి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు లత సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అసంక్రమిత వ్యాధులు గురించి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని కావున దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో కరపత్రాలతో అవగాహన పెంచాలని పేర్కొన్నారు.