అడ్డతీగల మండల కేంద్రం సమీపంలోని మద్దిగడ్డ రిజర్వాయర్ నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. 20 రోజులు వరకు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్కు భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో జలకల సంతరించుకుంది.మద్దిగడ్డ రిజర్వాయర్ ద్వారా అడ్డతీగల మండలంలో దాదాపు 5వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. పంటలకు సరిపడే నీరు వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.