జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయనీ,రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు.శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ హాల్లో యూరియా లభ్యతపై జాయింట్ కలెక్టర్ అదితీ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. రైతులకు ఎరువులు అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిమాండ్ ఆధారంగా ఎరువులు ఆర్ ఎస్ కే ల ద్వారా అందజేస్తామని తెలిపారు.